|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 04:30 PM
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నుంచి ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సందీప్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ‘అత్తమాస్ కిచెన్’ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి జాడీని సందీప్ రెడ్డి వంగాకు పంపించారు. దానితో పాటు ఓ ప్రేమపూర్వక సందేశాన్ని కూడా జతచేశారు. ఈ అనూహ్య కానుకకు సందీప్ రెడ్డి వంగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవకాయ జాడీ ఫొటోను షేర్ చేస్తూ, "ఈ సర్‌ప్రైజ్ చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంటుంది" అని రాసుకొచ్చారు. చరణ్ దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Latest News