by Suryaa Desk | Sun, Oct 06, 2024, 06:54 PM
దేవరకొండ పట్టణంలో శనివారం నాడు భవిత జూనియర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నామని కళాశాల యాజమాన్యం తెలిపారు. జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సంప్రదాయ దుస్తులతో ముస్తాబై బతుకమ్మను పేర్చి దాని చుట్టూ వలయకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు బతకమ్మ పండగ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్, డైరెక్టర్లు పల్స మల్లేష్ గౌడ్ ,వెంకట్ గౌడ్, రాంబాబు,అధ్యాపకులు బెజవాడ శంకర్ గౌడ్, విజయ్ కుమార్ ,రమేష్,సుస్మిత,నిరోషా, విద్యార్థులు,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.