by Suryaa Desk | Wed, Oct 09, 2024, 04:10 PM
భార్య చేస్తున్న అవినీతిని చూసి తట్టుకోలేక ఓ భర్త స్వయంగా ఆమె బాగోతాన్ని బయటపెట్టాడు. లంచంగా తీసుకున్న డబ్బులను ఇంట్లో ఎక్కడెక్కడ దాచిపెడుతున్నది వీడియో తీసి మరీ మీడియాకు విడుదల చేశాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే... హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ డీఈఈగా పనిచేస్తున్న దివ్యజ్యోతి లంచాలకు అలవాటుపడి రోజూ లక్షల రూపాయలు ఇంటికి తీసుకువచ్చేది. ఆమె అవినీతి చూసి భర్త శ్రీపాద్ తట్టుకోలేకపోయాడు. ఇలా అవినీతి సంపాదనను మానుకోవాల్సిందిగా వారించాడు. తప్పంటే తనను తిట్టేదంటూ వీడియో తీసి మీడియాకు ఇచ్చాడు. భార్య దివ్యజ్యోతి వేదన భరించలేక విడాకులు కూడా ఇచ్చినా శ్రీపాద్.. ఆమె ఇంట్లో అవినీతి సొత్తును ఎక్కడెక్కడ పెడుతుందో వీడియో తీసి భార్యను పట్టించాడు. దాదాపు రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దివ్యజ్యోతి అవినీతి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.