by Suryaa Desk | Tue, Oct 08, 2024, 12:04 PM
బాలాపూర్: విజయ దుర్గా నగర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోర్కెలను తక్షణమే తీర్చే అమ్మవారు, శ్రీ విజయ దుర్గా దేవి మంగళవారం 6వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు అర్చకులు శ్రీ జనార్ధన్ శర్మ ఆధ్వర్యంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.