by Suryaa Desk | Mon, Oct 07, 2024, 04:09 PM
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 51, 445 క్యూసెక్కుల ఉండగా, అవుట్ ఫ్లో 51, 444 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 588. 60 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312. 50 టీఎంసీలు గాను ప్రస్తుతం 308. 1702 టీఎంసీలుగా ఉందన్నారు.