by Suryaa Desk | Wed, Oct 09, 2024, 02:29 PM
తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్న కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. బుధవారం నాడు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.బుధవారం సాయంత్రం తరువాత కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. గురువారం ఉదయం వరకు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.