by Suryaa Desk | Wed, Oct 09, 2024, 08:16 PM
రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉంది.. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ ఈ రోజూ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్ ను తిట్టడానికి వినియోగిస్తున్నాడు సమాజాన్ని తీర్చి దిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంస్కార హీన సీఎం కేసీఆర్ ను కొరివి దయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరు.. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివిదయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృ ద్రోహి రేవంత్ రెడ్డికి ఈ మట్టి బిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయి నీ లాంటి కొరివి దయ్యాన్ని తెచ్చుకుని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పాశ్చాతాపంతో ఉంది అని హరీష్ రావు తెలిపారు