![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 12:46 PM
బంగారంతోపాటు వెండికి కూడా భారీగా డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరలు కొన్నిసార్లు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.అయితే గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. అయితే గత ఏడాదికాలంలోనే బంగారం ధర 38శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బంగారం, వెండి ధర పెరిగింది. శనివారం ఉదయం 6గంటల వరకు పలు వెబ్ సైట్లలో నమోదు అయిన ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 82,310గా ఉండగా..22క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై 11,00 వరకు పెరిగింది. అదే 24క్యారెట్లపై రూ. 1200 వరకు పెరిగింది. వెండి ధరలు కూడా లక్ష దాటి పరుగులు పెడుతున్నాయి.హైదరాబాద్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 82,310 ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 89, 790గా ఉంది. విశాఖ, విజయవాడ నగరాల్లోనూ 22క్యారెట్ల బంగారం ధర రూ. 82,310, 24క్యారెట్ల బంగారం ధర రూ. 89,790 పలుకుతోంది. వెండి లో వెండి ధర రూ.1,12,100 ఉండగా..విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,12,100 పలుకుతోంది.