![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 02:30 PM
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ దళితులకు విలువ ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని సక్రమంగా నడవకుండా చేస్తున్నారని మండిపడ్డారు.