![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 03:03 PM
మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్ అని ధ్వజమెత్తారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా చేయడం లేదన్నారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు అని మాజీ మంత్రి మండిపడ్డారు