by Suryaa Desk | Sat, Jun 22, 2024, 03:22 PM
భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా ప్రకటించిన పరువు వెబ్ సిరీస్ జూన్ 14న విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 50 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించింది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య మరియు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ నాయుడు ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. సుస్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సిరీస్ ని పవన్ సైదినేని సమర్పిస్తున్నారు.
Latest News