|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:43 PM
సూర్య, జ్యోతిక ప్రేమ పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటుంది. అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక కుటుంబ విషయాలను పంచుకున్నారు. 'నా ఫ్యామిలీ నను సినిమాల్లోకి వద్దన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా పెళ్లయ్యాక సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న మాట నిజమే. కానీ తల్లిగా నా పిల్లలను చూసుకునే బాధ్యత నా మీద ఎంతో ఉంది' అని చెప్పారు. నేను నటించిన పాత సినిమాలు టీవీలో వచ్చేటప్పుడు, ఆమె ఎంతో మంచి నటి. ఎందుకు ఆమెను సినిమాల్లోకి రానివడ్డం లేదని సూర్యకు కొంతమంది మెసేజ్‌లు పంపేవారు. ఆ మెసేజ్‌లను సూర్య నాకు ఫార్వార్డ్ చేసేవాడు. బాధ్యతల కారణంగా దూరంగా ఉన్న తప్ప నను ఎవరు వద్దు అనలేదు’ అని తెలిపింది.
Latest News