![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 10:58 AM
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అంటూ తెలుగువారి మనసు దోచుకున్న పూజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ట్రోల్ చేసేందుకు లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. అది తెలిసి ఆశ్చర్యపోయినట్లు నటి పూజా హెగ్డే తెలిపారు.. తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తన తల్లిదండ్రులు బాధపడినట్లు చెప్పొకాచ్చారు. ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలంటున్నారని అన్నారు.నన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్‌కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను. మరోవైపు ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు. అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు మీమ్ పేజెస్‌ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు. ట్రోలింగ్‌ను ఆపేయాలన్నా.. అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకది మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్లు నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కనీసం ఒక ఫోటో, పోస్ట్‌లాంటివేవీ ఉండదు. కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది.
Latest News