![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:05 AM
సినీ నటులపై నమోదైన బెట్టింగ్ కేసు మరో మలుపు తిరిగింది. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ సహా 25 మంది నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్ల మీద నమోదైన కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల్ని కూడా మియాపూర్ పోలీసులు నిందితులుగా చేర్చారు. మొత్తం 19 యాప్‌ల పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. అన్నింటికీ మూల కారణం యాప్‌లే కాబట్టి వాటి నిర్వాహకుల్ని కూడా నిందితులుగా విచారణకు పిలవాలని నిర్ణయానికి వచ్చారు.
Latest News