![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:15 PM
ప్రముఖ నటి అమీ జాక్సన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తాజాగా వెల్లడించారు. ఆ బాబుకు ఆస్కార్ అలెగ్జాండర్ అని పేరు పెట్టినట్లు నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమీ జాక్సన్, జార్జ్ పనియోటౌకు గత ఏడాది ఘనంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ పెళ్ళికి ముందే కొంతకాలం సహజీవనం చేశారు.చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది.
Latest News