![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:27 PM
సుహాస్ కథానాయకుడిగా రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ కామెడీ ‘ఓ భామ అయ్యోరామ’. ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా చిత్రాన్ని విడుదల చేయనుంది. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ ‘‘ప్రతీ సన్నివేశం కొత్తగా ఉండే అందమైన ప్రేమకథ ఈ చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘సుహాస్, మాళవిక కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ సినిమాకు ప్రధానాకర్షణ’’ అని దర్శకుడు రామ్ గోదాల చెప్పారు. ‘‘ఈ సినిమా మీ అందరి హృదయాలను దోచుకుంటుంది’’ అని నిర్మాత హరీష్ నల్ల తెలిపారు.
Latest News