|
|
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:22 PM
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన 'X' ఖాతాను తిరిగి పొందారు. ఫిబ్రవరిలో హ్యాక్ అయిన ఈ ఖాతా దాదాపు రెండున్నర నెలల తర్వాత పునరుద్ధరించబడింది. ఆమె ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఖాతా హ్యాక్ అయినప్పటి నుంచి 'X' బృందంతో సంప్రదింపులు జరిపి, చివరికి భారతదేశంలోని 'ఎక్స్' బృందం సహాయంతో తిరిగి పొందినట్లు తెలిపారు. అలాగే, తన పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని అభిమానులను హెచ్చరించారు.‘‘ఫిబ్రవరి 13న నా ఖాతా హ్యాకైంది. ఈ విషయమై ఎక్స్ బృందాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించాను. ఆటో జనరేటెడ్ రెస్పాన్స్‌లు తప్ప ఎలాంటి స్పందనా రాలేదు. ఖాతాను డిలీట్ చేయాలనుకున్నా వీలుపడటం లేదు. ఎందుకంటే, లాగిన్ అయ్యే అవకాశమే లేదు. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను క్లిక్ చేయొద్దు. అందులో పోస్టులను నమ్మొద్దు. నా ఖాతా రికవరీ అయిన వెంటనే నేనే వీడియో ద్వారా అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తా’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అలానే వీడియో షేర్ చేశారు.
Latest News