|
|
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 10:59 AM
బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్, మలైకా అరోరా, కరీనా కలిసి భోజనం చేయడానికి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ జరగగా అతడిపై సైఫ్ దాడి చేశారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో సాక్షిగా ఉన్న మలైకా విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు రెండోసారి బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.పోలీసులు కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్, రెస్టారెంట్ కి వచ్చిన ఒక వ్యక్తి ఆడవారితో తప్పుగా ప్రవర్తిస్తుంటే అతన్ని అడ్డుకునే క్రమంలో గొడవ జరిగిందని, ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో సైఫ్ అలీఖాన్ తో పాటు అతని స్నేహితుడు షకీల్, బిలాల్, ను కూడా అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రావాలని క్రితం లో ఒకసారి నోటీసులు జారీ అయ్యాయి. అప్పుడు ఆమె హాజరు కాకపోవడంతో రెండోసారి బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ కి కూడా సోమవారం కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పంపినట్టు సమాచారం .
Latest News