|
|
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 03:51 PM
నిన్న తన కారు పోయిందని పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్ ఇదంతా తన సోదరుడు మంచు విష్ణు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు.జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్న ఆయన గేటు బయట బైఠాయించి నిరసన తెలిపారు.తమది ఆస్తి గొడవ కాదన్నారు. తన జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.తనకు ఈ ఆస్తి వద్దని ఎప్పుడో తండ్రికి చెప్పానని, ఇది ఆస్తి గొడవ కాదని చెప్పారు.విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా అన్నారు. అక్కడే ఈ గొడవ మొదలైందని తెలిపారు.ఈ నెల 1న పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ కు వెళ్లిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశారని ఆరోపించారు.విష్ణు అనుచరులు వచ్చి కార్లను తీసుకెళ్లడంతో పాటు తన సెక్యూరిటీపై దాడి చేశారని మనోజ్ తెలిపారు.కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపించడం లేదని, తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మనోజ్ విజ్ఞప్తి చేశారు.
Latest News