|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 05:18 PM
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ 'రైడ్ 2' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో నటుడు ఫియర్లెస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమాయ్ పాట్నాయక్ గా కనిపించనున్నాడు. ఇది 2018 హిట్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ తమన్నా భాటియా కనిపించనున్న స్పెషల్ సాంగ్ ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ ని నిషా అనే టైటిల్ తో రేపు అంటే ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రాజ్ కుమార్ గుప్తా సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వాని కపూర్, రాజత్ కపూర్, సౌరభ్ శుక్లా కూడా నటించారు, మరియు తమన్నా భాటియా ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం మే 1, 2025న విడుదల కానుంది. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News