|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 09:23 PM
కీర్తి సురేశ్ ముద్దుగా ముద్దబంతిలా కనిపించే హీరోయిన్. తెరపైనే కావొచ్చుగానీ, అలిగితే అమ్మడి అందమే వేరు అనేది కుర్రాళ్ల మాట. అలాంటి కీర్తి సురేశ్ మొదటి నుంచి కూడా తమిళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చింది. తెలుగులో అడపాదడపా మాత్రమే చేస్తూ వచ్చినప్పటికీ, ఇక్కడ టాప్ త్రీ ప్లేస్ లోనే ఆమె పేరు కనిపిస్తూ వచ్చింది.అయితే ఇక్కడ కీర్తి సురేశ్ కి 'దసరా' సినిమా తరువాత హిట్ లేదు. ఈ సినిమా తరువాత కూడా ఆమె ఎక్కువగా తమిళ సినిమాలనే ఒప్పుకుంటూ వెళ్లింది. క్రితం ఏడాది ఆమె 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమా అక్కడి థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయినా బాలీవుడ్ లో తానేమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కీర్తి సురేశ్ ఉందని అంటున్నారు. రాజ్ కుమార్ రావు జోడిగా ఆమె ఓ సినిమాకి సైన్ చేసిందని టాక్.
Latest News