![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 02:32 PM
షణ్ముగం సప్పాని దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'షణ్ముఖ' క్రైమ్, సస్పెన్స్ మరియు అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అవికా గోర్ నప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాం ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చినది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పాని మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతాన్ని స్వరపరిచాడు. ఈ చిత్రాన్ని తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పాని, మరియు రమేష్ యాదవ్ నిర్మించారు.
Latest News