![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 03:09 PM
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘విశ్వంభర.’ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ‘రామ రామ’ అంటూ సాగే తొలి పాట రేపు విడుదల కానుంది. తాజాగా దీని ప్రోమోను విడుదల చేశారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. ఫుల్ సాంగ్ వినాలంటే రేపటివరకు ఆగాల్సిందే! విశ్వంభర విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Latest News