|
|
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 03:30 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను హనుమాన్ జయంతి కానుకగా శనివారం నాడు ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ‘రామ రామ’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అలాగే రేపు ఉదయం 11.12 గంటలకు పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఫుల్ ఎనర్జీటిక్‌గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.కాగా, ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్నారు. స్టాలిన్ మూవీ తర్వాత మెగాస్టార్ సరసన మరోసారి త్రిష ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.
Latest News