![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:02 PM
షాలిని పాండే..... 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ తో వచ్చిన క్రేజ్ తో తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా ఆఫర్స్ రాలేదు. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. 2022లో జయేష్ బాయ్ జోర్దార్ చిత్రంలో రణవీర్ సింగ్ సరసన నటించింది. ఈ డిజాస్టర్ అయినప్పటికీ తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది షాలినీ. కొన్ని రోజులుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న షాలినీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇటీవలే ఇన్‌స్టంట్ బాలీవుడ్‌తో జరిగిన చిట్ చాట్ లో షాలినీ మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అతడితో కలిసి ఒక్కరోజైనా పనిచేయాలని ఉందని కోరికను వ్యక్తం చేసింది. ఆ హీరో మరెవరో కాదు.. బీటౌన్ స్టార్ రణబీర్ కపూర్. షాలినీ మాట్లాడుతూ.. "రణబీర్ కపూర్‌తో కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. ఒక్కరోజైనా అతడితో కలిసి పనిచేయాలని ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా అతడి కళ్లలో ఓ మ్యాజిక్ ఉంది. అతడిలో ఏదో మాయ ఉందని అనిపిస్తుంది. తెరపై అతడితో కలిసి నటించాలని.. ప్రేమలో పడేందుకు ఆసక్తిగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.అలాగే తనను ఎక్కువగా అలియా భట్ తో పోలుస్తారని.. ఆ విషయం తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది. అలియా భట్ అద్భుతమైన నటి అని.. ఇండస్ట్రీలోకి మరో అలియా అవసరం లేదని తెలిపింది. తనకు ఒక నటిగా గుర్తిస్తే చాలని తెలిపింది. ప్రస్తుతం ఆమె ధనుష్ నటిస్తోన్న ఇడ్లీ కడై మూవీలో కనిపించనుంది.
Latest News