![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 05:51 PM
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జాక్' ఏప్రిల్ 10, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. బొమ్మరిల్లూ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో సిద్ధూ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాలోని దేత్తడి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. అచు రాజమణి కంపోస్ చేసిన ఈ సాంగ్ కి యాదగిరి లిరిక్స్ అందించగా, జస్ప్రీత్ జాజ్ మరియు సాహితి తమ గాత్రాలని అందించారు. ఈ సినిమాలో రవి ప్రకాష్, నరేష్, బ్రహ్మాజీ, హర్ష, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీచరన్ పకాల నేపథ్య స్కోరును నిర్వహిస్తున్నారు.
Latest News