![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 06:58 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమా యొక్క మ్యూజికల్ ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని రామ రామ అనే టైటిల్ తో విడుదల చేసింది. కీరవాణి కంపోస్ చేసిన ఈ సాంగ్ కి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాశారు, దీనిని శంకర్ మహాదేవన్ మరియు లిప్సిక ఆకర్షణీయంగా పాడారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Latest News