![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 02:45 PM
ప్రఖ్యాత టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన 'జాట్' చిత్రం ఏప్రిల్ 10, 2025న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ రివ్యూస్ ని అందుకుంటుంది. రెజీనా కాసాండ్రా, సైయామి ఖేర్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా చిత్రం విడుదలైన మూడు రోజులలో గ్లోబల్ బాక్స్ఆఫీస్ వద్ద 32.2 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రణదీప్ హుడా, వినీట్ కుమార్ సింగ్, జగపతి బాబు, రమ్య కృష్ణ మరియు స్వరూపా ఘోష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వరుసగా మైథ్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నెని మరియు వై రవి శంకర్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు.
Latest News