|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 07:31 PM
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ కి తన బిలియనీర్ బెస్ట్ ఫ్రెండ్ అనన్య బిర్లా 4.99 కోట్ల విలువైన లిలక్ లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చారు. అనన్య గాయకురాలు, ముసిషన్ మరియు వ్యాపారవేత్త. ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు. అనన్య లంబోర్ఘినిని ముంబైలోని జాన్వి కపూర్ నివాసానికి శుక్రవారం అందజేశారు. అనన్య జిమ్ బీన్జ్ నిర్మించిన 'లివిన్ ది లైఫ్' తో 2016లో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అనన్య బిర్లా వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా యొక్క పెద్ద బిడ్డ. ఆమె అమెరికన్ స్కూల్ ఆఫ్ బొంబాయిలో చదువుకుంది మరియు తరువాత UK లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహణలో డిగ్రీ సంపాదించింది. అనన్య యొక్క నెట్‌వర్కర్త్ 13 బిలియన్ డాలర్స్. వర్క్ ఫ్రంట్ లో చూస్తే, జాన్వీ కపూర్ పరమ్ సుందరి అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం జులై 25న విడుదల కానుంది.
Latest News