![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:38 PM
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమురి కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' చిత్రం ఏప్రిల్ 18న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తన పాత్ర కోసం కళ్యాణ్ రామ్ మేక్ఓవర్ చేయించుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా యొక్క ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ శక్తివంతమైన విరోధిగా నటించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, పృధివి రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, సాయి మంజ్రేకర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, మ్యూజిక్ కంపోజర్ అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ తమ్మిరాజు మరియు స్క్రీన్ ప్లే రైటర్ శ్రీకాంత్ విస్సాతో సహా అద్భుతమైన సాంకేతిక బృందం ఉంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.
Latest News