![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:53 PM
రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది. ఈ విషయాన్ని ఎవరినడిగినా చెబుతారు. అలాంటిది రాజమౌళి మాత్రం మూడు సినిమాల కోసం వేచి చూస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయింది. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా, ప్రస్తుతం ఫారిన్‌లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా ఓ ప్రేక్షకుడిగా కొన్ని సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్', ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న మూవీ 'స్పిరిట్'తో పాటు రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న 'పెద్ది' మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. ఈ మూడూ పాన్ ఇండియా మూవీలే కావడంతో ఎలా ఉంటాయో అనే ఆతృత తనకు కూడా ఉందని ఆయన అన్నారు. ఈ మూవీలపై రాజమౌళి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయా మూవీ హీరోల అభిమానులు సంతోషపడుతున్నారు.
Latest News