![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 07:29 PM
ప్రశంసలు పొందిన దర్శకుడు పూరి జగన్నాద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలతో మేలో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రారం ఈ సినిమాలో ప్రముఖ నటి రాధికా ఆప్టే ముఖ్య పాత్ర కోసం చర్చలు జారుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఇది పూరి జగన్నాద్ మరియు విజయ్ సేతుపతికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి పూరి జగన్నద్ నటి-నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించనున్నారు.
Latest News