|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 10:31 AM
మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం ఓదెల–2. సంపత్ నంది, మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం కొందరితోనే ఏర్పడుతుంది. అలా నాకు సంపత్ గారితో ఏర్పడింది. ఈ సినిమా సంపత్, మధు కోసమైన హిట్ కావాలి’ అంటూ తెలిపింది.ప్రముఖ దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ......‘‘దీన్ని రూపొందించడంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. కాశీలో సినిమాను ప్రకటిద్దాం అని అడగ్గానే ఓకే అన్నారు. కుంభమేళాలో టీజర్ లాంఛ్ చేద్దామంటే అంగీకరించారు. అన్నిటికీ చాలా సహకరించారు. సంకల్ప బలంతో మంచి సినిమాను తెరకెక్కించాము కాబట్టే లెక్కలు (బిజినెస్) అన్నీ కూడా సినిమాకు ముందే సెట్ అయ్యాయి. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తమన్నా (Tamannaah) ఎన్నో నియమాలు పాటించారు. చెప్పులు వేసుకోలేదు. మాంసాహారం తీసుకోలేదు. ఎండలో చెప్పులు లేకుండా నటించారు. సాయంత్రానికి కాళ్లు బొబ్బలు ఎక్కాయి. టీమ్‌లోని వారంతా కష్టపడ్డారు. అందరికంటే తమన్నా ఎక్కువ శ్రమించారు’’ అని చెప్పారు.
Latest News