|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 01:01 PM
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న తాజా చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, దిశా పటాని నటించనున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఇక జాన్వీ కపూర్ కూడా.. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. త్వరలో రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘దేవర పార్ట్ 2’తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఇలా ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తున్నారనే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News