|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 03:51 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న క్రేజీ మూవీ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. మూవీ టీం కాస్త విరామం తీసుకుంది. రాజమౌళి జపాన్ పర్యటనలో ఉండగా.. మహేష్ బాబు రోమ్ వెళ్లారు. అలాగే, ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లారు.తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు.. తాజాగా హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తిరిగి రావడంతో 'SSMB29' మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాజమౌళి జపాన్ పర్యటనలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరప్రమోషన్స్ కోసం ఆయన కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లారు. ఈ సినిమాకు సంబంధించి మూడేళ్ల ప్రయాణంలో ది బెస్ట్ మూమెంట్స్‌ను 1:38 గంటల నిడివితో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్స్ దృశ్యాలు, నటీనటులు, మూవీ టీం అభిప్రాయాలు ఇందులో చూపించారు. ఈ ప్రమోషన్లలో దర్శకధీరుడు బిజీగా మారారు. ఆయన టూర్ సైతం ముగించుకుని వచ్చాక 'SSMB29' మరో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఇటీవలే ఒడిశాలో 'SSMB29' మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తైంది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News