|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 04:46 PM
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరియు నటుడు కమల్ హాసన్ యొక్క అత్యంత అంచనాల ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్' షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సిలంబరసన్ టిఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా, త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో శింబు, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, నాజర్, ఢిల్లీ గణేష్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, జోజు జార్జ్, జిషు సేన్‌గుప్తా, రోహిత్ సరాఫ్, వైయాపురి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా రవి కె చంద్రన్, ఎడిటర్‌గా ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు యాక్షన్ కొరియోగ్రఫీని అన్బరివు ద్వయం నిర్వహిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు ఆర్‌కెఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్మించిన థగ్ లైఫ్ తమిళ చిత్రసీమలో అత్యంత అంచనాలున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.
Latest News