|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 10:31 AM
నటి ఖుష్బూ తన తాజా ఫోటోలపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. ఈ ఫొటోల్లో ఖుష్బూ మోడ్రన్ దుస్తులలో అద్భుతమైన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో సన్నగా, స్టైలిష్ కనిపిస్తూ బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఆమె రూపాంతరం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె సన్నబడడాన్ని ప్రసంశించగా.. మరికొందరు ఆమె బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు తీసుకున్నారు అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. కాగా, దీనిపై ఖుష్బూ స్పందింస్తూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు ఎలాంటి మనుషులు? సోషల్ మీడియాలో మీరెప్పుడూ మీ మొహాలు చూపించరు! ఎందుకంటే అంత అసహ్యంగా ఉంటారు కావున మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తుంది అని రీట్వీట్ చేశారు.
Latest News