|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 02:25 PM
సుమయ రెడ్డి మరియు పృథ్వీ అంబర్ ప్రధాన పాత్రలలో 'డియర్ ఉమా' అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. సుమయ రెడ్డి ప్రధాన పాత్ర పోషించడమే కాక ఆమె బ్యానర్ సుమా చిత్ర ఆర్ట్స్ కింద సినిమా రచయిత మరియు నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కి భారీ స్పందన లభిస్తుంది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి నుండి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, అమాని మరియు రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. సుమా చిత్ర ఆర్ట్స్ బ్యానర్ క్రింద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.
Latest News