|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 05:43 PM
ఎంటర్టైన్ మెంట్ రంగం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. దశాబ్దానికో కొత్త ట్రెండ్ వస్తోంది. అలా ఇప్పుడు ఏఐ హవా కొనసాగుతోంది. భవిష్యత్తులో మార్కెట్ ని శాసించేది అంతా ఇదేనని అంతా ఫిక్స్ అయ్యారు కూడా. ఇప్పటికే పలు బడా సంస్థలు దీనిమీద కోట్లు వెచ్చిస్తున్నాయి. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఏఐ పవర్ మీడియా కంపెనీని అనౌన్స్ చేశాడు. అంతేకాక ప్రముఖ కంపెనీతో భారీ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు . మారుతున్న టెక్నాలజీని సినీరంగంలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తు దిల్ రాజు కంపెనీ వదిలిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే 'క్వాంటమ్ AI గ్లోబల్'తో కలిసి.. తన కొత్త AI స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు వీడియో ద్వారా తెలియచేశాడు. సినిమా ప్రస్ధానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులను ఈ చిన్నవీడియోలో చూపించారు. ఇప్పుడు ఏఐ అన్నిరంగాలను శాసిస్తుండటంతో... దిల్ రాజు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాడట. దీని పూర్తి వివరాలు మే 4న ప్రకటిస్తారట.కామన్ గా దిల్ రాజు ఏడాదికి కనీసం ఆరేడు సినిమాలు తీయగల సత్తా ఉన్న నిర్మాత. సో తన సొంత సినిమాలన్నింటిలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఉపయోగించే ఛాన్స్ కనిపిస్తోంది. డబ్బింగ్ నుంచి విజువల్ ఎఫెక్స్ వరకూ ఎలాంటి వర్క్ నైనా ఏఐతో చేసుకునే అవకాశం ఉంది. అందుకే టాలీవుడ్ కు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజు. ప్రస్తుతం దిల్ రాజు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ, పంపిణీ చేస్తు బిజీగా ఉన్న ఆయన కొత్త కంపెనీకి శ్రీకారం చుట్టడం ఆయన ముందు చూపును తెలియచేస్తోంది.
Latest News