|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:50 PM
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఇటీవల మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అగ్ర హీరో సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ మత్తులో తనపై అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన నటులతో ఇకపై సినిమాలో పనిచేయబోనని స్పష్టం చేశారు. కాగా, ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.నటుడి పేరు లేదా సినిమా పేరు చెప్పకుండానే.. 'ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంతో ఇబ్బందిపడ్డా. తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు. అందరి ముందే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. నా జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన సంఘటన' అని చెప్పుకొచ్చింది.
Latest News