|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:31 AM
కన్నడ నటుడు శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు ఉపేంద్ర, రాజ్. బి శెట్టి కలిసి నటించిన తాజా చిత్రం '45'. ఈ మూవీ తమిళ టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకు కమల్, అమితాబ్ చాలా ఇష్టం అన్నారు. కమల్ అంటే అందమని, తాను అమ్మాయిగా పుట్టుంటే కచ్చితంగా ఆయన్ను పెళ్లాడేవాడినని తెలిపారు. కొన్నేళ్ల కింద తన తండ్రి రాజ్‌కుమార్‌ను చూసేందుకు కమల్ హాసన్ తమ ఇంటికి వచ్చినప్పుడు అనుమతి తీసుకుని మరీ ఆయనను కౌగిలించుకున్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత మూడు రోజుల వరకూ స్నానం కూడా చేయలేదని, ఆయనంటే అంత ఇష్టమంటూ శివరాజ్ కుమార్ చెప్పారు. లోకనాయకుడు నటించిన అన్ని సినిమాలు తొలి రోజు మొదటి షోనే చూస్తానని తెలిపారు.
Latest News