|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 07:53 PM
నటి, నిర్మాత మంచు లక్ష్మి నేతృత్వంలో కొనసాగుతున్న 'టీచ్ ఫర్ చేంజ్' సంస్థ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ స్పెషల్ ఈవెంట్ లో యువ కథానాయకుడు అరవింద్ కృష్ణ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ ఫ్యాషన్ షోలో అరవింద్ కృష్ణ ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్, ఆత్మవిశ్వాసంతో కూడిన నడకతో ఈవెంట్‌కు ప్రత్యేక శోభను తీసుకొచ్చాడు. ఫ్యాషన్ కు దాతృత్వం జోడించి, 'టీచ్ ఫర్ చేంజ్' లక్ష్యాలకు మద్దతు కూడగట్టే ఉద్దేశ్యంతో మంచు లక్ష్మి ఈ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి అరవింద్ కృష్ణ రాక మరింత గ్లామర్‌ను జోడించింది. ఆయన ఉత్సాహం అదనపు స్పార్క్ ను జోడించింది. కాగా, అరవింద్ కృష్ణ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
Latest News