|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:31 AM
కళ్యాణ్ రామ్ హీరోగా, నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి, కల్యాణ్ రామ్ ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తల్లీకొడుకులుగా వారి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.చిత్ర విజయోత్సవ మీడియా సమావేశంలో కల్యాణ్ రామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందని ఆయన అన్నారు. ఇంతవరకు భారతీయ సినిమాలో తాను అలాంటి సన్నివేశం చూడలేదని తన కుమారుడు చెప్పాడని, ఈ విషయంలో గర్వంగా ఉందని తన కుమారుడు అన్నట్లు కల్యాణ్ రామ్ తెలిపారు.ప్రేక్షకుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. శ్రీకాంత్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ చాలామందికి నచ్చిందని ఆయన అన్నారు. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను గుర్తు చేసే చిత్రమిదని కల్యాణ్ రామ్ తెలిపారు.
Latest News