|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 09:29 AM
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్స్ఆఫీస్ పఠాన్ మరియు జవాన్ రూపంలో హిట్ అందుకున్నాడు. కాని అతని చిత్రం డుంకి ప్లాప్ గా మారింది. అప్పటి నుండి అతను తన తదుపరి ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అతను సిద్ధార్థ్ ఆనంద్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి 'కింగ్' అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో నటుడు తన కుమార్తె సుహానా ఖాన్ తో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకుంటున్నాడు. ఈ బిగ్గీలో SRK కు జోడిగా దీపికా పదుకొనే కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ లో అభిషేక్ బచ్చన్ విరోధిగా నటిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో అర్షద్ వార్సీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సామాచారం. ఈ చిత్రం రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పబడింది. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Latest News