|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:41 PM
కోలీవుడ్ సీనియర్ నటి త్రిష క్రిష్ణన్ పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్‌తో కలిసి త్రిష నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఇలా షాకింగ్ సమాధానం చెప్పారు. మొత్తంగా తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని త్రిష స్పష్టం చేశారు. ఇక ఆమె సమాధానం విని పక్కనే ఉన్న కమల్ కూడా షాకయ్యారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా త్రిష పెళ్లిపై వదంతలు వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఆ పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు.తన పెళ్లి ఎప్పుడు అవుతుందో తనకే తెలియదన్నారు. కానీ, తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికేతే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అలాగే తనను పెళ్లిచేసుకోబోయేవాడు జీవితాంతం తనతో కలిసి ఉంటాడనే నమ్మకల కలగాలని చెప్పారు. అప్పుడే పెళ్లి చేసుకుంటానన్నారు. పెళ్లిచేసుకుని మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోవడం తనకు ఇష్టం లేదన్నారు. వివాహం చేసుకుని చాలామంది అసంతృప్తిగా జీవిస్తున్నారని, అలాంటి పరిస్థితి తనకు ఎదురుకాకూడదని త్రిష స్పష్టం చేశారు.
Latest News