|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:58 PM
నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి త్రిష. చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ త్రిష. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో మరోసారి అందం, అభినయంతో కట్టిపడేసింది త్రిష.ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ అండ్ క్రీమ్ కలర్ శారీలో సింపుల్ మేకప్ లుక్తో మెస్మరైజ్ చేస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్ లా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ అండ్ క్రీమ్ కలర్ శారీలో సింపుల్ మేకప్ లుక్తో మెస్మరైజ్ చేస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్ లా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.