|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 02:27 PM
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, వీరికి ఇప్పటికే ఆర్యన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే."మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లిరోజు నాడు పాప పుట్టడం ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి" అంటూ 'ఎక్స్' వేదికగా ఓ క్యూట్ ఫొటోను పంచుకున్నారు. దీంతో ఈ దంపతులకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. కాగా, ఈ జంట 2021 ఏప్రిల్ 22న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత సరిగ్గా పెళ్లిరోజు నాడే చిన్నారి జన్మించడం ఎంతో ప్రత్యేకమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News