|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 11:27 AM
బాలీవుడ్ ఇండస్ట్రీ దిగజారిపోయిందని ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇతర భాషల చిత్ర పరిశ్రమల నుంచి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని సూచించారు. మంచి కంటెంట్‌తో గొప్ప సినిమాలు రూపొందించేందుకు స్కోప్ ఉన్నా, ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని వ్యాఖ్యానించారు.ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని.. ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము. అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు
Latest News