|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 07:47 PM
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది.పాత సినిమాల్ని 4కే టెక్నాలజీతో కొత్తగా ముస్తాబు చేయడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొత్తగా త్రీడీ సొబగులు మిక్స్ చేశారన్నమాట. జగదేక వీరుడు లాంటి ఫాంటసీ సినిమాని త్రీడీలో చూడడం కొత్తగానే ఉంటుంది. పైగా మే 9.. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన డేట్. అదే రోజున ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తోంది. నిజానికి ‘విశ్వంభర’ సినిమాని మే 9నే విడుదల చేద్దామనుకొన్నారు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కూడా అదే రోజున తీసుకొద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఎలాగైతేనేం.. ఆ రోజున ఓ మెగా సినిమా వస్తోంది. ఫ్యాన్స్‌కి ఈ ఉత్సాహం చాలు.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా మ్యూజిక్.. మ్యాజిక్ చేశాయి. చిరు – శ్రీదేవి జంటని చూడ్డానికే జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లేవారట. ఓతరాన్ని ఊపేసిన ఈ సినిమా ఇప్పుడు ఈతరాన్ని ఎలా థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.
Latest News