|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:18 PM
ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 37వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన తన భార్య సుచిత్రపై ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఒక అందమైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోలో మోహన్ లాల్ తన భార్య సుచిత్ర చెంపపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించారు. సుచిత్ర ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసింది.ఈ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మోహన్ లాల్, "ప్రియమైన సుచికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. నీకు ఎప్పటికీ కృతజ్ఞుడను, ఎప్పటికీ నీవాడినే" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. మోహన్ లాల్, ప్రముఖ తమిళ నిర్మాత కె. బాలాజీ కుమార్తె అయిన సుచిత్రను 1988లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ప్రణవ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Latest News